Sat Dec 06 2025 00:06:21 GMT+0000 (Coordinated Universal Time)
Leopard : మహానంది క్షేత్రం వద్ద మళ్లీ చిరుతపులి
మహానంది క్షేత్రం వద్ద మళ్లీ చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులు భయపడి పరుగులు తీశారు.

మహానంది క్షేత్రం వద్ద మళ్లీ చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులు భయపడి పరుగులు తీశారు. నంద్యాల నియోజకవర్గం మహానందిలో చిరుత పులి గత కొద్ది రోజులుగా తిరుగుతుంది. ఇటీవల గోశాల సమీపంలో చిరుత కనిపించింది. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోసారి కనపడటంతో...
ఈరోజు మరోసారి చిరుత కనపడింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న చిరుతపులి అక్కడే తిరుగుతుంది. రాత్రి వేళలో భక్తులు, స్థానికులు ఎవరూ ఒంటరిగా తిరగవద్దని, బయట నిద్రించవద్దని కూడా అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Next Story

