Sun Mar 08 2026 12:26:52 GMT+0530 (India Standard Time)
Leopard : చిరుతపులి మళ్లీ కనిపించింది.. మహానందిలో హై అలెర్ట్
చిరుతపులి మహానంది పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి

చిరుతపులి మహానంది పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. మహానందిలోని గోశాల వద్ద చిరుత రాత్రి సంచరించింది. అక్కడ చిరుత వచ్చి కాసేపు తిరిగి వెళ్లడం కెమెరాల్లో రికార్డయింది. దీంతో స్థానికులను, భక్తులను ఆలయ అధికారులు అప్రమత్తం చేశారు.
మైకుల్లో ప్రచారం...
స్థానికులు ఎవరూ పెంపుడు జంతువులను బయట వదలొద్దని తెలిపారు. అలాగే మహానందిలో రాత్రి వేళ భక్తులు బయట పడకోవద్దని కూడా మైకుల్లో హెచ్చరిస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చిరుత అక్కడే సంచరిస్తుండటంతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మహానందికి వెళ్లే భక్తులు రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Next Story

