Fri Jan 09 2026 22:02:44 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత
తిరుమలలోని శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది

తిరుమలలోని శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళుతున్న చిరుతపులిని కొందరు వీడియో తీసి పో్స్టు చేశారు. మెట్ల మార్గం నుంచి వెళుతున్న భక్తులు కొందరు ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలియజేశారు. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు.
భక్తుల రాకపోకలు...
వెంటనే అప్రమత్తమయిన అటవీశాఖ, టీటీడీ సిబ్బంది శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలను కొంతసేపు నిలిపేశారు. అక్కడే చిరుతపులి సంచరించే అవకాశముండటంతో అక్కడ కొందరు అటవీ శాఖ అధికారులను ఉంచారు. మరొకవైపు చిరుత పులి సంచారంతో సాయంత్రం వేళ చిన్న పిల్లలతో ఇటు వైపు రావద్దని సూచిస్తున్నారు.
Next Story

