Mon Apr 13 2026 14:12:18 GMT+0530 (India Standard Time)
శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర చిరుత
శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర చిరుత సంచారం కలకలం రేపుతుంది

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఘాట్ రోడ్డులో భక్తులకు చిరరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అప్రమత్తంగా ఉండాలని...
దీంతో ఆ మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ట్రాప్ కెమెరాలను కూడా అమర్చారు. భక్తులు గుంపులుగానే వెళ్లాలని కోరుతున్నారు.
Next Story

