Sun Mar 15 2026 08:17:51 GMT+0530 (India Standard Time)
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీంతో భక్తులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు కలిగాయి.

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీంతో భక్తులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు కలిగాయి. తిరుమల రెండవ ఘాట్ రోడ్డు వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అలిపిరి తనిఖీ కేంద్రం, వినాయక స్వామి ఆలయం మధ్య కుసుమ రహదారిలో చిరుత సంచరించింది. చిరుతను చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Next Story

