Thu Jan 29 2026 04:13:26 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మలమడుగులో చిరుతపులి
జమ్మలమడుగులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జమ్మలమడుగు మండలంలోని గండికోట రిజర్వాయర్ వద్దకు చిరుత పులి నీరు తాగింది

జమ్మలమడుగులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జమ్మలమడుగు మండలంలోని గండికోట రిజర్వాయర్ వద్దకు చిరుత పులి వచ్చి నీరు తాగింది. అక్కడ నీరు తాగేందుకు వచ్చిన చిరుతపులిని విద్యుత్తు ఉద్యోగులు గమనించారు. తమ ఫోన్లలో చిరుతపులి కదలికలను రికార్డు చేయడంతో ిఇక్కడ చిరుతపులి సంచారం ఉందని తేలింది.
అటవీ శాఖ అధికారులకు...
చిరుతపులి సంచారంపై విద్యుత్తు ఉద్యోగులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతపులిని బంధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుతపులి తిరిగి అడవిలోకి వెళ్లి ఉంటుందని, పెంపుడు జంతువులను రాత్రి వేళలో బయటకు వదలవద్దని కోరుతున్నారు.
Next Story

