Sun Mar 08 2026 12:27:07 GMT+0530 (India Standard Time)
Mahanandi : చిరుతపులి సంచారంతో మహానందిలో ఆంక్షలు
మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత పులి తిరుగుతోంది చిరుత పులి సంచారంతో మహానంది లో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు

మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత పులి తిరుగుతోంది చిరుత పులి సంచారంతో మహానంది లో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఆలయ శివారు ప్రాంతమంతా దేవస్థానం సిబ్బంది, అటవీ సిబ్బందితో రాత్రంతా పహారా కాస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఆరు బయట నిద్రిస్తున్న వారిని శుభతో మండపాలలో నిద్రిస్తున్న వారందరిని ఖాళీ చేయించారు.
నిన్న రాత్రి...
భక్తులకు నిన్న రాత్రి అభిషేక మండపం లో నిద్రించేందుకు అవకాశాన్ని అధికారులు కల్పించారు. నిన్న గోశాల ప్రాంతంలో చిరుతపలి సంచరించిందని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించకూడదని రాత్రి తెల్లవారుజాము నుంచి దేవస్థానం సిబ్బందిమైకుల ద్వారా ప్రకటనలు చేస్తూ భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.
Next Story

