Sun Mar 08 2026 04:17:00 GMT+0530 (India Standard Time)
తిరుపతి జూ పార్కులో చిరుత మృతి
తిరుపతి జూ పార్క్ లో చిరుత మృతి చెందింది. చిరుత అస్వస్థతకు గురి కావడంతో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేశారు

తిరుపతి జూ పార్క్ లో చిరుత మృతి చెందింది. చిరుత అస్వస్థతకు గురి కావడంతో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో వైద్యాన్ని అందించారు. అయితే చివరకు మాత్రం చిరుత మరణించిందని జూ పార్క్ అధికారులు ప్రకటించారు. చిరుత మృతిపై జూ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. చిరుత మృతి పట్ల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఉన్నతాధికారులు...
చిరుత మృతి చెందిందని తెలియడంతో ఉన్నతాధికారులు వచ్చి విచారణ జరిపారు. అయితే వైద్యులు అందించిన వైద్యం వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. చిరుత కొంతకాలంగా అస్వస్థతతో ఉందని, అయితే వైద్యసాయం అందించినా మరణించిందని అధికారులు తెలిపారు.
Next Story

