Wed Mar 04 2026 12:16:38 GMT+0530 (India Standard Time)
Leopard : తిరుమలలో మరోసారి చిరుత
తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది.

తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి టోల్ గేట్ సమీపంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేసింది. ఈరోజు తెల్లవారుజామున జింకపై దాడి చేసి చిరుతపులి చంపడంతో అటవీ శాఖ అధికారులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
అలిపిరి టోల్ గేట్ వద్ద...
అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై చిరుత జాడ కోసం వెదుకుతున్నారు. కాలినడకన చేరుకునే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత కాలినడక రావద్దని కోరుతున్నారు. గుంపులుగానే రావాలని కూడా అధికారులు కోరుతున్నారు.
Next Story

