Sun Mar 08 2026 05:43:37 GMT+0530 (India Standard Time)
గిద్దలూరులో చిరుత కలకలం.. గుంతలో పడి
గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుత పులి కలకలం రేపింది.

గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుత పులి కలకలం రేపింది. పాత పేపర్ మిల్లు సమీపంలో చిరుత పులి ఒక గుంతలో చిక్కుకుంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గుంతలో చిరుత పులి చిక్కుకుందని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ప్రత్యేక బృందాలు...
వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది అక్కడకు చేరకుని చిరుత పులి బయటకు రాకుండా గుంతపై వలవేశారు. చిరుత పులిని సురక్షితంగా బంధించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుతను సేఫ్ గా బోనులో ఎక్కించేందుకు తిరుపతి, మార్కాపురం నుంచి ప్రత్యేక టీమ్ లను అటవీ శాఖ అధికారులు రప్పిస్తున్నారు.
Next Story

