Thu Jan 29 2026 01:48:41 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నిరసనగా టీడీపీ సభ్యులు అసెంబ్లీకి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నిరసన తెలుపుతూ ర్యాలీగా వచ్చారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నిరసన తెలుపుతూ ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యేలందరూ కలసి ప్రదర్శనగా వస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించిన జగన్ ఆ ఊసే మరిచిపోయారన్నారు. జాబ్ క్యాలెండర్ విడదలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి తర్వాత ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.
వ్యతిరేక నినాదాలతో...
బై బై జగన్ అన్న నినాదాలతో అసెంబ్లీకి వచ్చారు. అనేక రకాలుగా ప్రజలను మోసం చేయడంతో పాటు మభ్య పెడుతూ జగన్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని, ఈసారి జనం జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యేలందరూ నినాదాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రికత్త నెలకొంది. పోలీసులకు. టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.
Next Story

