Fri Dec 05 2025 17:39:46 GMT+0000 (Coordinated Universal Time)
కమిటీ ముందుకు రాని ఉద్యోగ సంఘాల నేతలు
మంత్రుల కమిటీ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు హాజరు కాలేదు.

Heading
Content Area
మంత్రుల కమిటీ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు హాజరు కాలేదు. ఈరోజు 12 గంటలకు సమావేశానికి హాజరు కావాలని ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే పీఆర్సీ జీవో రద్దు చేస్తేనే తాము చర్చలకు వస్తామని చెప్పింది. జీవోలను ప్రభుత్వం రద్దు చేయకపోవడంతో తాము చర్చలకు వెళ్లేది లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి దృష్టికి....
ఉద్యోగ సంఘాలు చర్చలకు రాలేమని చెప్పడంతో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోసారి చర్చలకు ఉద్యోగ సంఘాలను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశముంది.
Next Story

