Mon Jan 20 2025 15:16:31 GMT+0000 (Coordinated Universal Time)
NDA Alliance : సీట్ల సర్దుబాటు కుదిరినట్లేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ , మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ హాజరయ్యారు.
అనపర్తి సీటు మాత్రం...
కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు. కొన్ని సీట్లను మార్చుకునే విషయంపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా అనపర్తి సీటుతో పాటు మరికొన్ని సీట్లను మార్చుకునేందుకు నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఏలూరు పార్లమెంటు స్థానంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై పార్టీ పెద్దల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ నేతలు చెప్పినట్లు సమాచారం. అనపర్తి సీటు టీడీపీకి ఇస్తే తంబళ్లపల్లె లేదా రాజంపేట పార్లమెంటు పరిధిలోని మరొక సీటు బీజేపీకి కేటాయించే అవకాశముంది.
Next Story