Sun Mar 08 2026 01:31:42 GMT+0530 (India Standard Time)
YSRCP : ఒంగోలు సీఎం కార్యక్రమానికి నేతలు డుమ్మా
ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు నేతలు దూరంగా ఉన్నారు

ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు నేతలు దూరంగా ఉన్నారు. పార్టీ టిక్కెట్ దక్కదని భావించిన నేతలు ఈరోజు కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒంగోలులో ఇరవై వేల మందికి వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు అందరు నేతలు హాజరయినా ఇటీవల తమకు సీటు దొరకని నేతలు మాత్రం దూరంగా ఉన్నారు.
ఈ నేతలంతా...
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ , మాగుంట రాఘవరెడ్డి తదితరులు దూరంగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా హాజరు కాలేదు. అయితే వీరి గైర్హాజరీపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. అసంతృప్తితోనే సీఎం సభకు దూరంగా ఉన్నారని తెలిసింది.
Next Story

