Sat Dec 06 2025 00:04:22 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు దీనంగా ముద్రగడ లేఖ
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కాపు ఉద్యమంలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వయంగా వచ్చి తాను ధన్యవాదాలు తెలపాలని ఉన్నా కలవలేని పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ తాను మిమ్మల్ని కలిసినా కాపు జాతిని తాకట్టు పెట్టి పదవుల కోసం వెళ్లి కలిశారని కొందరు విమర్శలు చేస్తారన్నారు. అన్యాయంగా పెట్టిన కేసులు భగవంతుడు మీ ద్వారా మక్షం కలిగించారన్నారు.
ఏనాడో చేసుకున్న పాపం....
ప్రత్యక్షంగా వచ్చి ధన్యవాదాలు తెలియచెప్పక పోవడం తాను ఏనాడో చేసుకున్న పాపమని ముద్రగడ పద్మనాభం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కాపులను బీసీ ఎఫ్ లో చేర్చినప్పుడు స్వయంగా వెళ్లి ధన్యవాదాలు తెలపాలనుకున్నా చేయలేెకపోయాయని చెప్పారు. చంద్రబాబు, జగన్ లను స్వయంగా కలుసుకునే పరిస్థితిలో తాను లేనని ఆయన ఆవేదనతో జగన్ కు లేఖ రాశారు.
Next Story

