Sun Mar 15 2026 13:26:02 GMT+0530 (India Standard Time)
జగన్ కు ముద్రగడ లేఖ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూనే వాటి పేర్ల విషయంలో మాత్రం ముద్రగడ జగన్ కు కొన్ని సూచనలుచేశారు. గోదావరిజిల్లాల్లో ఒక జిల్లా పేరు అంబేద్కర్ పేరును పెట్టాలని కోరారు. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలనికోరారు. కోనసీమ జిల్లా కు మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరు పెట్టాలని ముద్రగడ తన లేఖలో కోరారు.
జిల్లాల పేర్లు...
కొత్త జిల్లాల ఏర్పాటు బాగానే ఉంది కాని కొన్ని పేర్లను విస్మరించారని ఆయన తన లేఖలో తెలిపారు. జిల్లాల్లో ఉన్న సెంటిమెంట్, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పేర్లు పెట్టాలని ముద్రగడ తన లేఖలోకోరారు. అవకాశం ఉంటే వీరి పేర్లు పెట్టాలని, మనసు పెట్టి ఆలోచించాలని జగన్ ను ముద్రగడ పద్మనాభం తన లేఖలో కోరారు.
Next Story

