Thu Mar 19 2026 12:58:34 GMT+0530 (India Standard Time)
ఉద్యోగులూ మమ్మల్ని నమ్మండి
ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏసీబీ కేసులకు భయపడేది లేదని చెప్పారు

ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏసీబీ కేసులకు భయపడేది లేదని చెప్పారు. తాను కోట్లకు కోట్లు సంపాదించలేదని, తన జీతం ద్వారా వచ్చిన ఆదాయమే ఉందని చెప్పారు. ఉద్యోగులు తమను నమ్మాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఏసీబీ కేసులకు....
ఏసీబీ కేసులంటే భయపడి ఉద్యమాన్ని ఆపుతామని భావించవద్దని చెప్పారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఏ క్షణాన్నైనా తాము ఉద్యమానికి దిగుతామని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం పీఆర్సీపైనా మిగిలిన అంశాలపైన స్పష్టత ఇస్తుందని తెలిపారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని అన్నారు.
Next Story

