Sun Mar 08 2026 00:11:55 GMT+0530 (India Standard Time)
17వ తేదీకి విచారణ వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో వైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో కూడ విచారణను మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 17 మధ్యాహ్నం విచారణ నిర్వహించనున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారించారు. ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై కూడా ఈరోజు సుప్రీం విచారించింది. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది. బాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
Next Story

