Thu Jan 29 2026 03:20:15 GMT+0000 (Coordinated Universal Time)
Elections : నేడు నామినేషన్లకు ఆఖరి రోజు
నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఆఖరి తేదీ నేడుకావడంతో పెద్ద సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి

నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఆఖరి తేదీ నేడుకావడంతో పెద్ద సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి. నిన్న ఒక్కరోజే పార్లమెంటు స్థానాలకు 203 మంది, అసెంబ్లీ స్థానాలకు 1,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే.
రేపు పరిశీలన...
ఈ నెల 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఫారాలను కూడా అందచేశాయి. రేపు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరగనుంది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
Next Story

