Wed Jan 28 2026 19:15:53 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో పోటెత్తుతున్న ఓటర్లు.. డోలీలో తీసుకు వచ్చి మరీ?
ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా మహిళలు, యువత, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా మహిళలు, యువత, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో అక్కడ క్యూ లైన్ లన్నీ నిండిపోయాయి.
అల్లూరి జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకు వస్తున్న ఘటన పోలింగ్ పట్ల ఈసారి ఎంత ఆసక్తి ఉందో చెప్పకనే తెలుస్తుంది. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.
Next Story

