Sat Jan 31 2026 07:16:24 GMT+0000 (Coordinated Universal Time)
మండే.. కూడా కొండ నిండుగానే
తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తిరుమల కొండలు భక్తుల గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తిరుమల కొండలు భక్తుల గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయి. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
దర్శన సమయం ఎంతంటే..?
రూ.300ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,794 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35,560 మంది తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.67 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పుడు క్యూలోకి వెళితే పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారతాయని టీటీడీ తెలిపింది.
Next Story

