Sat Mar 07 2026 19:36:23 GMT+0530 (India Standard Time)
బెజవాడలో భారీగా ట్రాఫిక్ జాం.. క్లియర్ చేస్తున్న పోలీసులు
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు విజయవాడకు తరలివస్తున్నారు

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు విజయవాడకు తరలివస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపుగా 5 కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్థంభించింది.
దారి మళ్లింపు...
పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు మూడు పార్టీలకు చెందిన వారు తరలి వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికే విజయవాడ, గన్నవరం రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను దారి మళ్లించారు.
Next Story

