Sun Feb 01 2026 18:19:21 GMT+0000 (Coordinated Universal Time)
Relief Fund: వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన లలిత జ్యువెలర్స్
వరద బాధితులను ఆదుకోడానికి పలు సంస్థలు, పలువురు ప్రముఖులు

డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ తన మంచి మనసును చాటుకున్నారు. లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడును విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి రూ.1 కోటి చెక్కు అందించారు. కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.
వరద బాధితులను ఆదుకోడానికి పలు సంస్థలు, పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఏపీ పోలీసు అధికారుల సంఘం సీఎం సహాయనిధికి భారీ విరాళం అందించింది. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ పోలీసులు తమ వంతుగా రూ.11,12,50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి విరాళం అందించారు. వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు విరాళం ఇచ్చింది. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

