Sun Mar 15 2026 22:53:18 GMT+0530 (India Standard Time)
KVP : చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో ప్రాంతీయ పార్టీలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్కు ప్రజలు అధికారంలోకి తీసుకు వస్తారని ఆయన అన్నారు. వైఎస్ కేబినెట్లో పనిచేసిన అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తననాతో టచ్లో ఉన్నారని కేవీపీ రామచంద్రరావు తెలిపారు.
కాంగ్రెస్ లో చేరేందుకు ....
వారిలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆసక్తిచూపుతున్నారని తెలిపారు. వైఎస్ ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారన్న కేవీపీ వైఎస్ఆర్ 75వ జయంతిని మంగళగిరిలో ఘనంగా జరుపుతామని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్ ఉందని అని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుందని ఆయన జోస్యం చెప్పారు.
Next Story

