Sun Mar 08 2026 02:53:17 GMT+0530 (India Standard Time)
కుప్పంలో పోస్టల్ బ్యాలట్ లలో ఇద్దరికీ జీరో....?
కుప్పం మున్సిపల్ కౌంటింగ్ ప్రారంభమయింది. ఇక్కడ మూడు పోస్టల్ బ్యాలట్లు ఉండగా ఒక్కటి కూడా వేయలేదు

కుప్పం మున్సిపల్ కౌంటింగ్ ప్రారంభమయింది. ఇక్కడ మూడు పోస్టల్ బ్యాలట్లు ఉండగా ఒక్కటి కూడా వేయలేదు. ఎవరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులున్నాయి. ఒక వార్డు ఏకగ్రీవం అయింది. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలవడంతో 24 వార్డులకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది.
24 వార్డుల్లో....
24 వార్డుల్లోనూ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. కౌంటింగ్ కేంద్రం వద్ద రెండు పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున మొహరించారు. 144వ సెక్షన్ విధించినా కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు.
Next Story

