Thu Dec 18 2025 10:19:32 GMT+0000 (Coordinated Universal Time)
Kuppam Politics: అసలు కుప్పంలో ఏమి జరుగుతోంది?
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు పలువురు

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు పలువురు పార్టీ మారుతున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కౌన్సిలర్లతో కలిసి డాక్టర్ సుధీర్ అమరావతికి వెళ్లారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం సుధీర్ ఓ వైపు ఎదురుచూస్తూ ఉన్నారని తెలుస్తోంది.
ఇంతలో పలువురు టీడీపీ నేతలు కుప్పంలో సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోమ్ పై దాడికి తెగబడ్డారు. వైసీపీ హయాంలో చంద్రబాబును విమర్శించడమే కాకుండా, టీడీపీ నేతలను టార్గెట్ చేసి హింసించారని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాలు టార్చర్ పెట్టిన వైసీపీకి చెందిన వాళ్ళను టిడిపిలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకోమంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రియ నర్సింగ్ హోమ్ అద్దాలు పగలగొట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Next Story

