Mon Apr 06 2026 23:26:39 GMT+0530 (India Standard Time)
పారిపోయి చెరువులో దూకి చనిపోయాడు : ఎస్పీ
మదనపల్లె చిన్నారిని హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని జిల్లా ఎస్పీ తెలిపారు

మదనపల్లె చిన్నారిని హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని జిల్లా ఎస్పీ థీరజ్ తెలిపారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని రక్షక్ వాహనంలో వెళుతుండగా తప్పించుకుని వాహనం దూకి వెళ్లిపోయాడని, అయితే తర్వాత పోలీసులు గాలించగా కనిపించలేదని తెలిపారు. తర్వాత స్థానికుల అందించిన సమాచారం మేరకు చెరువులో కులవర్ధన్ మృతదేహం కనిపించిందని తెలిపారు.
చిన్నారిపై అత్యాచార ఘటన...
మదనపల్లెలో చిన్నారిపై జరిగిన సంఘటన దురదృష్టకరమని ఎస్పీ తెలిపారు. అయితే ఈ ఘటనను కొందరు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని చూశారని వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. నిందితుడు కులవర్థన్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చామని, వారు కూడా వస్తున్నారని ఆయన తెలిపారు.
Next Story

