Fri Dec 05 2025 18:56:08 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి..?
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కెఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యే అవకాశాలున్నాయి

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కెఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు, రేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిసింది. ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నవంబరు 30వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని నియమించడం దాదాపుగా ఖాయమయిందన్న వార్తలు ఐఏఎస్ వర్గాలు ద్వారా తెలుస్తోంది.
నేడు ఉత్తర్వులు...
డిసెంబరు 1వ తేదీ నుంచి జవహర్ రెడ్డి కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జవహర్ రెడ్డి 2024 జూన్ వరకూ పదవిలో కొనసాగనున్నారు. జవహర్ రెడ్డి 1990 వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జవహర్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సమీర్ శర్మకు నామినేటెడ్ పోస్టులో నియమిస్తారంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా సమీర్ శర్మను నియమించే అవకాశాలున్నాయి.
Next Story

