Fri Dec 05 2025 12:36:53 GMT+0000 (Coordinated Universal Time)
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖలు వచ్చాయి.

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖలు వచ్చాయి. రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. నెల్లూరులోని ఆమె నివాసం వద్ద భద్రతాసిబ్బందికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లేఖ ఇచ్చి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
గుర్తు తెలియని వ్యక్తి వచ్చి...
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ ఇచ్చిందెవరు? ఏ కారణంతో ఆ లేఖను ఇచ్చాడన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీన ఆ లేఖ రాగా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఏమైనా ఉందా? లేక ఆకతాయి పనేనా? అన్న కోణంలోనూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

