Sun Mar 15 2026 21:30:02 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ ను చెడుగుడు ఆడుకున్న ప్రసన్న
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన అన్నారు

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. అసలు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులకు ఏపీ అనేది ఒకటుందని గుర్తుందా? అని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సినిమా ఇండ్రస్ట్రీ మొత్తం ఒక సామాజికవర్గం మయంగా మారడంతోనే జగన్ ను వారు సీఎంగా గుర్తించడం లేదని చెప్పారు.
ట్యాక్స్ అంతా అక్కడ కట్టి....
ప్రజల కోసం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే తప్పేంటని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కోట్లు సంపాదించుకుంటున్న హీరోలు, నిర్మాతలు ఏపీలో ఒక్క సినిమా అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. ట్యాక్స్ అంతా తెలంగాణకే కడుతున్నారన్నారు. అటువంటి వారు తమ ప్రభుత్వాన్ని విమర్శించడమేంటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల పై ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నారా? అని ప్రసన్న కుమార్ రెడ్డి నిలదీశారు.
Next Story

