Sun Mar 15 2026 07:00:17 GMT+0530 (India Standard Time)
కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నా : కోటంరెడ్డి
ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయించాలని కేంద్రహోంశాఖకు లేఖ రాశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు

ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయించాలని కేంద్రహోంశాఖకు లేఖ రాశానని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతుంటే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. త్వరలోనే తాను కేంద్ర హోంమంత్రిని కలిసి నేరుగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగడం సరికాదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు.
అభివృద్ధి పనులను...
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ నిధులు మంజూరు చేసినా అధికారులు అడ్డుపడుతున్నారన్నారు. తన మీద కక్షతో నియోజకవర్గంలో సమస్యలను మరింత పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజముంటే నిరూపించాలని కోటంరెడ్డి సవాల్ విసిరారు.
Next Story

