Fri Dec 05 2025 21:08:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సీనియర్లే అంతా చేస్తున్నారు
సొంత పార్టీ నేతలపై నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

సొంత పార్టీ నేతలపై నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ నియోజకవర్గాల్లో పని చేసుకోకుండా వాటిని వదిలేసి ఇతర నియోజకవర్గాల్లో నేతలు వేలు పెడుతున్నారన్నారు. సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. కష్టపడే వారిపైనే కుట్రలు చేస్తున్నారన్నారు. తరచూ మార్చే సీజనల్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బాలినేని లాగే...
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తాను ఇబ్బంది పడుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాలినేని అజాతశత్రువని, ఆయనపై సొంత పార్టీనేతలే కుట్ర చేయడం దారుణమని శ్రీధర్ రెడ్డి అన్నారు. ముఖ్యనేతలు, సీనియర్ నేతలు తనను బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. బాలినేని లాగే తనపై కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, పెట్టాల్సిన సమయంలో వాతలు పెడతారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story

