Sat Mar 07 2026 21:00:30 GMT+0530 (India Standard Time)
బాబు సమక్షంలో చేరిన ఇండిపెండెంట్.. అక్కడ ఆసక్తికరం
కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారింది.

కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీలో చేరడంతో ఆ పార్టీది పై చేయి అయింది. చంద్రబాబు సమక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ 15 వార్డుల్లో గెలిచినట్లయింది.
ఎక్స్ అఫిషియో సభ్యులు....
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులున్నాయి. వైసీపీ 14, టీడీపీ 14 వార్డులు గెలుచుకున్నాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా శ్రీలక్ష్మి గెలిచారు. శ్రీలక్ష్మి టీడీపీలో చేరడంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. అయితే ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేరే అవకాశాలున్నాయి.
- Tags
- kondapalli
- tdp
Next Story

