Sat Mar 07 2026 19:19:59 GMT+0530 (India Standard Time)
కొండపల్లి ఎన్నిక నేడే... ఫలితం మాత్రం?
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్నికల ఫలితాన్ని మాత్రం వెల్లడించవద్దని, ఎన్నికలపై నివేదికను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో నేడు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద ఇతరులు రాకుండా 144 సెక్షన్ ను విధించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేేశారు.
వీడియో రికార్డింగ్...
కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలన్న కోర్డు ఆదేశాల మేరకు వారికి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లను పోలీసు శాఖ చేసింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నేడు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుండటంతో రెండు పార్టీలు తమ కౌన్సిలర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో తీసుకు వచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు.
Next Story

