Sat Mar 07 2026 19:19:05 GMT+0530 (India Standard Time)
గందరగోళం మధ్య కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక వాయిదా
కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.

కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈరోజు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. మొత్తం 20 మంది వార్డు సభ్యుల్లో అందరూ కార్యాలయానికి చేరకున్నారు. అయితే ఎక్స్ అఫిషియో ఓటు ను వినియోగించుకునేందుకు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చారు.
దూసుకు రావడంతో.....
ఈ సందర్భంగా కొంత గందరగోళం జరిగింది. వైసీపీ కార్యకర్తలు కార్యాలయంలోకి దూసుకు వచ్చారు. కేశినేని నాని ఓటు వేయడానికి లేదని నినాదాలు చేశారు. సమావేశంలో ఇబ్బంది కరమైన పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

