Wed Jan 07 2026 02:45:33 GMT+0000 (Coordinated Universal Time)
కోనసీమలో గ్యాస్ పైపు లైన్ లీక్.. ఆరు గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు
కోనసీమలో మరోసారి బ్లో అవుట్ జరిగింది.

కోనసీమలో మరోసారి బ్లో అవుట్ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ.ఎన్.జీ.సీ గ్యాస్ పైపులైన్ లీకయి భారీగా మంటలు చెలరేగాయి. జిల్లాలోనిమలికిపురం మండలం ఇరుసుమండలో దాదాపు ఐదు గంటలుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీంతో మంటలను ఆర్పేందుకు ఒ.ఎన్.జి.సి సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది గత కొన్ని గంటలుగా శ్రమిస్తున్నామంటలు అదుపులోకి రాలేదు. గ్యాస్ భారీగా లీకవుతుండటంతో మంటలు పెద్దగా వ్యాప్తి చెందాయి. ఇరుమండ గ్రామాన్ని మొత్తాన్ని ఖాళీ చేయించారు. గ్రామంలోని మూడు వందల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దీనిపై ఓఎన్జీసీ అధికారులు తమఉన్నతాధికారులకుతెలియేశామని, సాంకేతిక నిపుణుల సాయంతో మంటలను అదుపు చేస్తామని చెబుతున్నారు.
మాడిమసయిన కొబ్బరి చెట్లు...
వేలాది కొబ్బరిచెట్లు ఇప్పటికే మాడి మసైపోయాయి. కొబ్బరి తోటలు దగ్దం కావడంతో తీవ్రంగా నష్టం జరిగిందని తెలసింది. దాదాపు వెయ్యికి పైగా కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు సమాచారం. ఘటన స్థలికి కలెక్టర్, ఎస్సీ చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఒక వైపు గ్యాస్ లీక్ ఆగకపోవడం, మరొకవైపు మంటల ఉధృతి తగ్గకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఊరు ఖాళీ...
గ్రామస్థులను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. గ్యాస్ ను పీల్చకుండా మాస్క్ లను కూడా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయి ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. గ్యాస్ లీక్ ను కట్టడి చేసిన తర్వాతనే మంటలను అదుపులోకి తేగలగమని ఒ.ఎన్.జి.సి అధికారులు చెబుతున్నారు. అది ఎప్పటికి జరుగుతుందో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మొత్తం మీద మలికిపురం బ్లో అవుట్ తో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారన్ని బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Next Story

