Fri Jan 30 2026 02:49:44 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీలో కోడికత్తి శీను
కోడికత్తి శీను టీడీపీలో చేరాడు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు

కోడికత్తి శీను టీడీపీలో చేరాడు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై చేసిన దాడి కేసులో బెయిల్పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు.
అన్ని పార్టీలూ సహకరించినా...
జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైళ్లో ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు శ్రీను కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని పార్టీల మద్దతు లభించినా తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని అన్నారు. తాను బతికి ఉండటానికి కారణం ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలేనని అన్నారు.
Next Story

