Sun Mar 08 2026 07:11:30 GMT+0530 (India Standard Time)
సీఎంవోకు కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు
కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు

కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వారు ముఖ్యమంత్రి జగన్ కు వినతి పత్రం అందచేశారు. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను బెయిల్ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని వారు సీఎంవోను అభ్యర్థించారు.
కుటుంబం గడవటం కోసం...
గత నాలుగేళ్లుగా తమ కుమారుడు ఈ కేసులో జైలులో ఉన్నారని, దీంతో తమకు ఇల్లు గడవడం కష్టంగా మారిందని విన్నవించారు. తాము వృద్ధాప్యంలో ఉన్నామని, ఈ వయసులో తమ కుమారుడు శ్రీను అవసరం కుటుంబం గడవటం కోసం ఎంతో అవసరమని వారు వివరించారు. తమ కుటుంబంపై జాలి చూపించి నిరభ్యంతర పత్రాన్ని అందచేయాలని వారు వినతిపత్రాన్ని అందచేశారు.
Next Story

