Kodela : కోడెల శివరాం పొలిటికల్ ఫ్యూచర్.. అయోమయం.. గందరగోళం
కోడెల శివప్రసాద్ కుటుంబం రాజకీయాలకు దాదాపుగా దూరమయినట్లే కనిపిస్తుంది

దివంగత మాజీ మంత్రి... నవ్యాంధ్రప్రదేశ్ తొలిస్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించినా రాజకీయంగా ఆయన సమైక్యాంధ్రప్రదేశ్లోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబ రాజకీయ ప్రస్థానంతో ఆయనతోనే దాదాపు ముగిసిపోయినట్టుగానే కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ ఓడిపోయారు. ఆయన మరణాంతరం ఆయన వారసుడు శివరాం సత్తెనపల్లి ఇన్చార్జ్ పగ్గాల కోసం చేయని ప్రయ్నతం అంటూ లేదు. శివరాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు సత్తెనపల్లి ఇన్చార్జ్ పగ్గాలు నాన్చుతూ వచ్చి ఎన్నికల గత ఏడాది బీజేపీ నుంచి పసుపు కుండువా కప్పుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారు. శివరాం గగ్గోలు పెట్టినా చంద్రబాబు, చినబాబు లోకేష్ ఇద్దరూ లైట్ తీసేుకున్నారు. అటు నరసారావుపేట వైపు కన్నేద్దామనుకుంటే అక్కడ బీసీ కోటాలో అరవిందబాబు కాచుకుని ఉన్నారు. అప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ కోటాలో నేతలు లెక్కకు మిక్కిలిగా నియోజకవర్గాలు ఆక్రమించేసుకుని ఉన్నారు. వీరి మధ్యలో కోడెల శివరాం గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

