Thu Dec 18 2025 17:52:57 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాభి పైనుంచి దిగొచ్చాడా?
గన్నవరం ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పట్టాభి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం వల్లనే అల్లర్లు జరిగాయన్నారు

గన్నవరం ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పట్టాభి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం కారణంగానే అల్లర్లు జరిగాయన్నారు. పట్టాభి గురించి ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుందని, అతడు రెచ్చగొట్టిన వైనాన్ని మాత్రం కప్పి పుచ్చిందని అన్నారు. ఒక వర్గం మీడియా తప్పుడు కథనాలను ప్రచురించిందన్నారు. పట్టాభి ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? అని కొడాలి నాని ప్రశ్నించారు.
ఒళ్లు కొవ్వెక్కి...
పిచ్చి వాగుడు, పిచ్చి రాతలు రాస్తే బట్టలూడదీసి కొడతారని కొడాలి నాని హెచ్చరించారు. పట్టాభిని అసలు గన్నవరం ఎవరు వెళ్లమన్నారని? నేనా. జగన్మోహన్ రెడ్డి గారా? అని నాని ప్రశ్నించారు. ఒళ్లు బలిసి కొవ్వు ఎక్కువై అక్కడకు వెళ్లి తన్నులు తిన్నాడు తప్ప మరేదీ కాదన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే దానిని పక్కదోవ పట్టించేందుకు పట్టాభిని వినియోగించడం మామూలయిపోయిందని కొడాలి నాని మండి పడ్డారు. గన్నవరం వెళ్లి వంశీని పిల్ల సైకో అంటే ఎవరైనా ఊరుకుంటారా? అని నిలదీశారు. ఈ 420 గాళ్లకు ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని కొడాలి నాని హెచ్చరించారు.
Next Story

