Sat Dec 27 2025 10:56:18 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : నాని రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లేనా?
మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు

మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కొడాలి నాని గుడివాడకు దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. గుండెకు శస్త్ర చికిత్స జరగడంతో వైద్యులు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో కొడాలి నాని హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే గుడివాడకు వచ్చి అలా కనిపించి వెళుతున్నారు. అయితే కొడాలి నాని మాత్రం గుడివాడలోని తన ముఖ్య అనుచరులతో టచ్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండే కొడాలి నాని త్వరలోనే గుడివాడకు మకాం మారుస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
విశ్రాంతి అనంతరం...
ఇటీవల గుడివాడ పర్యటనలో కొడాలి నాని ఈ విషయాన్ని స్పష్టంగాచెప్పారు. తాను వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే గుడివాడకు వచ్చి ఇక్కడే ఉంటానని చెప్పి అనుచరుల్లో తిరిగి ఉత్సాహం నింపారు. మరొకవైపు కొడాలి నాని యాక్టివ్ అయితే అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. గుడివాడ నియోజకవర్గంలోతొలి సారి ఓటమి పాలయి కొడాలి నాని నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. గుడివాడలో గెలుపునకు తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురయింది. ఆ ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మరొకవైపు వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేశ్ లపై మాట్లాడిన మాటలతో ఆయన కూటమి సర్కార్ కు టార్గెట్ గా మారారనడంలో సందేహం లేదు.
కేసులు ఎదురుచూస్తున్నా...
2004 కొడాలి నాని టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఎన్నికయ్యారు. 2009లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వెళ్లారు.ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. కొడాలి నానిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయినా కొడాలి నాని తాను గుడివాడ కేంద్రంగా రాజకీయం చేయడానికి ఫిక్స్ అయినట్లు కనపడుతుంది. త్వరలోనే గుడివాడలోకి ఎంట్రీ ఇచ్చి తిరిగి పార్టీలో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. మరి కొడాలి నాని ఈ మూడేళ్ల రాజకీయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story

