Fri Jan 30 2026 21:16:44 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ను కలవాలని.. ఆ విషయం మాట్లాడాలనుకున్నా: కొడాలి నాని
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుని గుడ్డిగా నమ్మితే పవన్ కళ్యాణ్ అధోగతి పాలవుతారని హెచ్చరించారు కొడాలి నాని. రాజకీయాలను మారుస్తానంటున్న పవన్.. చంద్రబాబు మద్దతుదారులతో ఏవిధంగా కలిసి పనిచేస్తారని కొడాలని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేతను నమ్ముకుంటే జనసేనానికి కూడా ఎన్టీఆర్కు పట్టిన గతే పడుతుందన్నారు. దొంగలను, 420లను పవన్ పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరంలేదని.. చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయంగా వైసీపీని ఎదుర్కొంటే పవన్ కల్యాణ్కు సమాధానమిస్తామన్నారు. ఎన్నికలు అయ్యేవరకు పవన్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు రక్తంలో వెన్నుపోటు జీర్ణించుకుపోయిందని... ఈ విషయాన్ని తానే స్వయంగా కలిసి పవన్ కు చెప్పేందుకు చాలాసార్లు ప్రయత్నించానన్నారు. అది వీలుకాకపోవడంతో మీడియా ముఖంగా చెబుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపితే తమకేం అభ్యంతరం లేదన్నారు. కానీ చంద్రబాబు బినామీలతో కలిసి తమపై దాడి చేస్తే సహించేది లేదని.. అదే స్థాయిలో విమర్శలు చేస్తామన్నారు. తనకు అధికారం ఇస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, మరి 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. నలభై ఏళ్లు టీడీపీ, కాంగ్రెస్లో అధికారం అనుభవించి ఇప్పుడు సొల్లు కబుర్లు చెబుతున్నారన్నారు.
Next Story

