Fri Dec 05 2025 16:43:35 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేుపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలలో చర్చించనున్నారు.
సమావేశంలో కీలక అంశాలు...
ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కావాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలతో పాటు పలు ముఖ్యమైన విషయాలపై జగన్ నేతలతో చర్చించే అవకాశముంది.
Next Story

