Mon Mar 30 2026 14:55:39 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేత
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ తర్వాత వరసగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ గడువు విధించింది.
రేపటితో గడువు పూర్తవుతున్న...
దీంతో రేపటితో గడువు కూడా ముగుస్తుంది. దీంతో అడవుల్లో ఉన్న వారు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలమైన రాష్ట్రంలో పోలీసుల ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోతున్నారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిపోయిందని డీజీపీ ప్రకటించారు.
Next Story

