Fri Dec 05 2025 17:34:28 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : విశాఖలో నమోదయిన కేసులు ఒమిక్రాన్ వేరియంట్
విశాఖపట్నంలో నమోదయిన కరోనా కేసులకు సంబంధించిన కీలక సమాచారం అందింది. ఒమిక్రాన్ వేరియంట్ గా తేలింది

విశాఖపట్నంలో నమోదయిన కరోనా కేసులకు సంబంధించిన కీలక సమాచారం అందింది. పూనేలోని ల్యాబ్ లో రక్తనమూనాలను పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్ గా తేలింది. దీనిని బీఎ 2 తరహా వేరియంట్ గా గుర్తించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఇది కేవలం ఒమిక్రాన్ వేరియంట్ కావడంతో ప్రమాదమేమీ కాదని వైద్యులుచెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని విశాఖ కేజీహెచ్ వైద్యులు తెలిపారు.
రోజురోజుకూ పెరుగుతున్న...
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, అయితే రికార్డుల్లోకి మాత్రం రావడం లేదని చెబుతున్నారు. కోవిడ్ వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా కిట్లను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శఆఖ అన్ని ఆసుపత్రులను ఆదేశించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా అందుబాటులోకి తెచ్చుకోవాలని సూచించారు
Next Story

