Mon Nov 17 2025 09:30:19 GMT+0000 (Coordinated Universal Time)
నకిలీ మద్యం కేసులో ట్విస్ట్.. మరొక కీలక వ్యక్తి అరెస్ట్ కోసం?
ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలోనూ నకిలీ మద్యం డెన్ ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు

ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలోనూ నకిలీ మద్యం డెన్ ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లోని ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాకుండా గోవాలోనూ ఒక మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నటు స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు గుర్తించారు. గోవాలో జితిన్ అనే వ్యక్తి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి దేశంలోని అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జితిన్ ను నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థనరావుకు పరిచయం చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సరిహద్దులు దాటి...
ములకలచెరువులో బయటపడిన నకిలీ ముద్యం మూలాలు రాష్ట్ర సరిహద్దులు దాటి గోవా వరకూ విస్తరించాయి. అయితే జితిన్ కు ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరికి లింకులున్నాయన్న దానిపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. బెంగళూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి జితిన్ ను జనార్ధనరావుకు పరిచయం చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు జోగి రమేష్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
జితిన్ కోసం...
జోగి రమేష్ ను కస్టడీకి తీసుకోవడానికి స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు. పది రోజుల కస్టడీకి జోగి రమేష్ ను ఇవ్వాలని కోరనున్నారు. ఈ విచారణ ఈ కేసులో మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని న్యాయస్థానానికి చెప్పనున్నారు. గోవా వరకూ ఈ నకిలీ మద్యం విస్తరించడంతో పాటు సౌత్, నార్త్ గోవా, పనాజీ ప్రాంతాలకు నకిలీ మద్యాన్ని తయారు చేససినట్లు గుర్తించారు. జితిన్ కోసం ఎక్సైజ్ పోలీసులు వెతుకుతున్నారు. జితిన్ దొరికితేనే కాని అసలు నిందితుడు ఎవరు? దీని వెనక ఎవరున్నారన్నది తెలిసే అవకాశం లేదని స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
Next Story

