Thu Dec 11 2025 09:14:58 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి అరెస్ట్?
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు బెంగళూరులో ఉన్న జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి తంబళ్లపల్లికి తీసుకు వచ్చారని తెలిసింది. ఏ 17గా జయచంద్రారెడ్డి ములకలచెరువు మద్యం కేసులో నిందితుడిగా ఉన్నారు.
బెంగళూరులో అరెస్ట్ చేసి...
జయచంద్రారెడ్డిని గత కొన్ని నెలల నుంచి అరెస్ట్ చేయకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి ఆయనను తంబళ్లపల్లికి తీసుకు వచ్చి విచారిస్తున్నారని తెలిసింది. ఇటీవల వైఎస్ జగన్ మీడియా సమావేశంలోనూ జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Next Story

