Sat Feb 28 2026 17:52:07 GMT+0530 (India Standard Time)
Kethireddy : కేతిరెడ్డి కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో వైరల్ గా మారాయే?
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనస్సుల్లో నుంచి వచ్చినవే. అందుకే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కామెంట్స్ ను వైరల్ చేస్తున్నాయి. ఇంతకీ కేతిరెడ్డి ఏమన్నారంటే కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకోవద్దంటూ జగన్ కు నేరుగా చెప్పారు. కష్టకాలంలో పార్టీకి, పార్టీ అధినేతకు అండగా ఉండాల్సిన సమయంలో తమ స్వార్థం కోసం వెళ్లిన వారు ఎవరైనా సరే తిరిగి పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు పార్టీ కార్యకర్తల్లోకి వెళతాయని చెప్పారు.
బంధువులైనా సరే...
పార్టీని వీడింది బంధువులైనా, దగ్గర వారైనా తిరిగి చేర్చుకోవడం అనేది ఉండకూడదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు పొంది, ఆయనను కీర్తించిన వారు ఓటమి పాలు కాగానే పార్టీని విడిచి వెళ్లిన వారిని నమ్మకద్రోహులుగా పరిగణిస్తున్నారని, ఇది తన అభిప్రాయం మాత్రమే కాదని, రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తల మనస్సులో ఉన్నది మాత్రమే చెప్పానని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటున్నారు. ఓటమికి గల కారణాలను వెదుక్కుని వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్లాలని కూడా కేతిరెడ్డి జగన్ కు సూచించారు. అలా చేయకుంటే ప్రజలు వైసీపీని ఎందుకు ఆదరించాలని ఆయన ప్రశ్నిండం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది.
తిరిగి వైసీపీ గూటికి...
పార్టీని వీడిన నేతలు తిరిగి వైసీపీ గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. అటువంటి వారిని చేరదీస్తే ఉన్న నేతలు కూడా కొంత ఇబ్బంది పడతారని, తర్వాత పార్టీని వీడి వెళ్లేందుకు అందరూ ప్రయత్నం చేయవచ్చని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ రకంగా మాట్లాడరంటున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గతంలోనూ వాలంటీర్ వ్యవస్థపైనా, మద్యం దుకాణాల నిర్వహణ పైన కూడా ప్రభుత్వ తీరును తప్పు పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేరికల విషయంలో చేసిన కామెంట్స్ మాత్రం క్యాడర్ మొత్తం సమర్ధిస్తుంది. మరి అల్టిమేట్ గా జగన్ నిర్ణయం కావడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
Next Story

