Sat Dec 13 2025 22:33:50 GMT+0000 (Coordinated Universal Time)
కేరళలో భారీ వర్షాలు – మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట జిల్లాల్లో ఉదయం 7.15 గంటల నుంచి మూడు గంటలపాటు ఈ అలర్ట్ అమల్లో ఉంచారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
అత్యధిక వర్షపాతం...
అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఆరెంజ్ అలర్ట్ అంటే 11 నుండి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు జారీ చేసే హెచ్చరిక అని అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story

