Fri Dec 05 2025 17:50:28 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ కోరికకు వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ నియమితులు కానున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ నియమితులు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. యవకుడైన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ పల్నాడు ప్రాంతానికి చెందిన వారు. ఆయన కేరళలోని త్రిసూర్ జి్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ తనకు ఓఎస్డీగా కావాలన్న కోరికను చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
కృష్ణతేజను...
డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనను నియమించుకుంటే తన శాఖలకు సంబంధించిన వాటిలో కొన్ని సంస్కరణలు తేవచ్చని పవన్ భావించడం వల్లనే ఆయన నియామకానికి చంద్రబాబు ఓకే చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన నియమాక ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Next Story

